ఆదివారం 29 మార్చి 2020
National - Mar 20, 2020 , 06:59:01

30 నిమిషాల పాటు వేలాడిన‌ నిర్భ‌య దోషుల మృత‌దేహాలు

30 నిమిషాల పాటు వేలాడిన‌ నిర్భ‌య దోషుల మృత‌దేహాలు

ఢిల్లీ: నిర్భ‌య రేప్ దోషుల‌కు ఇవాళ తీహార్ జైల్లో ఉరి తీశారు.  న‌లుగుర్ని ఉద‌యం 5.30 నిమిషాల‌కు ఉరి తీసిన‌ట్లు జైలు అధికారులు చెప్పారు.  అయితే ఆ న‌లుగురి శ‌వాలు సుమారు 30 నిమిషాలు పాటు ఉరి కంబానికి వేలాడిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత శ‌వాల‌ను కింద‌కు దింపారు.  న‌లుగురికి మృత‌దేహాల‌కు ఢిల్లీలోని దీన్ ద‌యాల్ ఉపాధ్య‌య హాస్పిట‌ల్‌లో పోస్టు మార్ట‌మ్ నిర్వ‌హించ‌నున్నారు.  అంత‌క‌ముందు ఉద‌యం 3.30 నిమిషాల‌కు సుప్రీంకోర్టు ఓ పిటిష‌న్‌ను కొట్టివేసింది.  ఒకేసారి న‌లుగుర్ని ఉరితీయడం భార‌తీయ న్యాయ చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి. 

అక్ష‌య్ కుమార్‌, ప‌వ‌న్ గుప్తా, విన‌య్ శ‌ర్మ‌, ముకేశ్ సింగ్‌లు.. రాత్రి ఏమీ తిన‌లేదు.  వాళ్లు రాత్రంతా నిద్ర‌పోలేద‌ని కూడా జైలు అధికారులు చెప్పారు. జైలులో ఉన్న ఖైదీల్లో ఒక్క‌రు కూడా నిద్ర‌పోలేద‌ని అధికారులు వెల్ల‌డించారు. విడాకులు కావాల‌ని కోరిన అక్ష‌య్ కుమార్ భార్య‌.. జైలు బ‌య‌ట స్పృహ త‌ప్పిప‌డిపోయింది.  దోషులు మెడిక‌ల్‌గా ఫిట్ అని తేల్చిన త‌ర్వాత‌నే ఉరి తీశారు. న‌లుగురి శ‌వాల‌ను ప‌రిశీలించి, వారంతా మృతిచెందిన‌ట్లు తీహార్ జైలు డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ సందీప్ గోయ‌ల్ ప్ర‌క‌టించారు.  పోస్టుమార్టం కోసం మృతదేహాలను డీడీయూ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటలకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. 


logo