సోమవారం 30 మార్చి 2020
National - Mar 20, 2020 , 10:02:14

నిర్భయ దోషుల సంపాదన ఎంతో తెలుసా?

నిర్భయ దోషుల సంపాదన ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ : 2012 డిసెంబర్‌ 16వ తేదీ రాత్రి దేశ రాజధాని హస్తినలో కదిలే బస్సులో నిర్భయపై దారుణానికి పాల్పడ్డ రాక్షస మూక సంపాదన ఎంతో తెలుసా? ఈ కేసులో దోషులుగా ఉన్న నలుగురు వ్యక్తులు ముఖేశ్‌ సింగ్‌(32), పవన్‌ గుప్తా(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌(31)ను ఢిల్లీలోని తీహార్‌ జైల్లో శుక్రవారం ఉదయం 6:30 గంటలకు ఉరి తీశారు. 

ఈ ఏడేళ్ల కాలంలో ఈ నలుగురు 23 సార్లు జైలు నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో మొత్తం వీరి సంపాదన రూ.1,37,000. జైలు నిబంధనలు ఉల్లంఘించినందుకు వినయ్‌ శర్మ 11 సార్లు, అక్షయ్‌ ఒక సారి శిక్ష అనుభవించాడు. ఇక ముఖేష్‌ మూడు సార్లు, పవన్‌ ఎనిమిది సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించాడు. అక్షయ్‌ రూ. 69 వేలు సంపాదించగా, పవన్‌ రూ. 29 వేలు, వినయ్‌ రూ. 39 వేలు సంపాదించాడు. ముఖేష్‌ ఎలాంటి పని చేయలేదు. 2016లో ముఖేష్‌, పవన్‌, అక్షయ్‌.. పదో తరగతిలో అడ్మిషన్‌ తీసుకున్నప్పటికీ వారు పాస్‌ కాలేదు. 2015లో వినయ్‌ బ్యాచిలర్‌ డిగ్రీలో అడ్మిషన్‌ తీసుకున్నాడు.. కానీ పూర్తి చేయలేదు.  logo