గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 01:51:05

సుప్రీంకోర్టులో ముకేశ్‌ మరో పిటిషన్‌

సుప్రీంకోర్టులో ముకేశ్‌ మరో పిటిషన్‌
  • న్యాయ అవకాశాలను పునరుద్ధరించాలని అభ్యర్థన

న్యూఢిల్లీ: నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు గల న్యాయపరమైన అవకాశాలను పునరుద్ధరించాలని అభ్యర్థిస్తూ శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశాడు. కేంద్ర హోంశాఖ, ఢిల్లీ ప్రభుత్వం, ఈ కేసులో న్యాయస్థానానికి అమికస్‌ క్యూరీగా వ్యవహరించిన న్యాయవాది వృందా గ్రోవర్‌ తనకు వ్యతిరేకంగా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరాడు. నిర్భయ కేసులో దోషులు ముకేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌లకు ఈ నెల 20న ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు గురువారం తాజాగా డెత్‌ వారంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 


logo
>>>>>>