శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 03:25:50

ఉరి మళ్లీ వాయిదా

ఉరి మళ్లీ వాయిదా
  • నిర్భయ దోషుల కేసులో ఢిల్లీ అదనపు సెషన్స్‌ కోర్టు ఆదేశం
  • ఏకీభవించిన న్యాయమూర్తి..
  • వరుసగా మూడోసారి ఉరి అమలు నిలిపివేత
  • రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన దోషి పవన్‌
  • న్యాయపరమైన ప్రక్రియలు పూర్తికాలేదన్న న్యాయవాది

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరి అమ లు మరోసారి వాయిదా పడింది. దోషులను మంగళవారం ఉదయం ఉరి తీయాల్సి ఉండ గా.. చివరి నిమిషంలో నిరవధిక వాయిదా ప డింది. దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా చివరి నిమిషంలో  రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు సోమవారం క్షమాభిక్ష పిటిషన్‌ దరఖాస్తు చేశాడు. దీనిపై నిర్ణయం తీసుకునేవరకు ఉరిని నిరవధికంగా వాయిదా వేయాలని ఢిల్లీ అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది. దోషుల ఉరి వాయిదా పడటం ఇది మూడోసారి. గతంలో జనవరి 22, ఫిబ్రవరి 1 తేదీల్లో దోషులకు డెత్‌ వారంట్లు జారీ అయ్యాయి. దోషులు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తుండటంలో ఉరి ఆలస్యం అవుతున్నది. 


నాటకీయ పరిణామాలు 

ఢిల్లీ అదనపు సెషన్స్‌ కోర్టులో సోమవారం నాటకీయ పరిణామాలు జరిగాయి. ఉరిని వాయిదా కోరుతూ నిర్భయ దోషులు అక్షయ్‌ సింగ్‌, పవన్‌ కుమార్‌ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను ఉదయం కోర్టు కొట్టివేసింది. దీంతో పవన్‌ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు చేశారని అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ తెలిపారు. అయితే దీని పై మధ్యాహ్నం విచారణ జరుపుతామని అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రాణా పేర్కొన్నా రు. మధ్యాహ్నం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత ఏపీ సింగ్‌ ‘క్షమాభిక్ష పిటిషన్‌' అంశా న్ని జడ్జికి వివరించారు. రాష్ట్రపతి తుది నిర్ణ యం తీసుకునేవరకు ఉరి వాయిదా వేయాలన్నారు. దోషులు ఇంకా అవకాశాలన్నీ వినియోగించుకోలేదని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు నలుగురు దోషులను ఉరితీయొద్దని కోరారు.  


పవన్‌ పిటిషన్‌ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా ఉరిశిక్ష అమలు చేయడం సమంజసం కాదన్నారు. అదేసమయంలో క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్ల దాఖలులో జాప్యం చేస్తున్నారని దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌పై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు నిప్పుతో ఆటలాడుతున్నారు. జాగ్రతగా ఉండండి. చిన్న తప్పిదం జరిగినా ఎదుర య్యే పర్యవసానాలు మీకు తెలుసు’ అని జడ్జి అన్నారు.  మరోవైపు ,నిర్భయ కేసులో దోషి పవన్‌కుమార్‌ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని పవన్‌ అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. ‘ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం. క్యురేటివ్‌ పిటిషన్‌తోపాటు ఉరిని వాయిదా వేయాలన్న పిటిషన్లను కొట్టివేస్తున్నాం’ అని తీర్పు చెప్పింది. దోషుల అవయవ దానానికి అవకాశం ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం సుప్రీంకోర్టు కొట్టివేసింది. 


దోషులకు అండగా వ్యవస్థ: ఆశాదేవి

కోర్టులు తమ సొంత తీర్పును అమలు చేయడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నాయి. తరుచూ ఉరి వాయిదా పడటం న్యాయవ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తున్నది. వ్యవస్థ మొత్తం దోషులకు అండగా నిలుస్తున్నది. దోషులను ఉరితీస్తారన్న ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. నిర్భయ ఘటన కన్నా ఘోరమైన కేసు ఇంకోటి లేదు. అయినా నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. కో ర్టులు వేడుక చూస్తున్నాయి. న్యాయం అందించడంలో జాప్యాన్ని ప్రపంచం గమనిస్తున్నది.


logo