ఆదివారం 29 మార్చి 2020
National - Mar 20, 2020 , 09:54:38

వెక్కివెక్కి ఏడ్చిన నిర్భయ దోషులు

వెక్కివెక్కి ఏడ్చిన నిర్భయ దోషులు

న్యూఢిల్లీ : నిర్భయ కేసు దోషులు వెక్కివెక్కి ఏడ్చారు. ఉరి కంబం వద్దకు తీసుకెళ్లే కంటే ముందు నలుగురు దోషులు బోరున విలపించినట్లు జైలు అధికారులు తెలిపారు. తమకు కేటాయించిన సెల్స్‌లో దోషులు కంటతడి పెట్టారు. అయితే ఈ నలుగురు దోషులను జైలు అధికారులు నిశితంగా పరిశీలించారు. ఎందుకంటే ఉరి శిక్ష అమలు కంటే ముందే ఏదైనా నాటకమాడొచ్చు లేదా పరధ్యానం సృష్టించడానికి ప్రయత్నించొచ్చు. లేదా ఆత్మహత్యకు ప్రయత్నించే అవకాశాలు ఉండొచ్చని జైలు అధికారులు వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. 

దోషులు ఎలాంటి ఘటనలకు పాల్పడలేదు. కోర్టు ఆదేశించిన సమయం ప్రకారమే ఉదయం 5:30 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దీన్‌దయాల్‌ ఆస్పత్రికి తరలించారు. ఒక వేళ వారి కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోతే... పోలీసులే అంత్యక్రియలు నిర్వహిస్తారు. 


logo