మంగళవారం 31 మార్చి 2020
National - Feb 17, 2020 , 16:42:18

నిర్భ‌య దోషుల‌కు మార్చి 3న ఉరి..

నిర్భ‌య దోషుల‌కు మార్చి 3న ఉరి..

హైద‌రాబాద్‌:  నిర్భ‌య గ్యాంగ్ రేప్ కేసులో న‌లుగురు దోషుల‌కు మార్చి 3వ తేదీన ఉరి వేయ‌నున్నారు. ఈ కేసులో ఇవాళ ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది.  మార్చి 3వ తేదీ ఉద‌యం 6 గంట‌ల‌కు తీహార్‌ జైలులో  నిర్భ‌య దోషులకు ఉరిశిక్షను అములు చేయాలని ఆ వారెంట్‌లో కోర్టు ఆదేశించింది.  న‌లుగురు నిందితులకు డెత్ వారెంట్ జారీ చేయ‌డం ఇది మూడ‌వ‌సారి.  నిందితుల క్ష‌మాభిక్ష పిటిష‌న్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కార‌ణంగా.. గ‌త రెండు వారెంట్లు ర‌ద్దు అయ్యాయి. ఈ సారైనా నిందితుల‌కు ఉరిశిక్ష ప‌డుతుంద‌ని నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి ఆశాభావం వ్య‌క్తం చేసింది. పటియాలా హౌజ్ కోర్టులోని అడిష‌న‌ల్ సెష‌న్ జ‌డ్జి ధ‌ర్మేంద‌ర్ రాణా.. తాజా డెత్ వారెంట్ జారీ చేశారు.   logo
>>>>>>