సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 21:59:45

తుది దశకు నీరవ్‌ మోదీ అప్పగింత కేసు..

తుది దశకు నీరవ్‌ మోదీ అప్పగింత కేసు..

లండన్ : మోసం, మనీ లాండరింగ్ ఆరోపణలపై భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింత కేసు లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టులో తుది దశకు చేరనుంది. రెండు బిలియన్‌ డాలర్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో తప్పించుకొని లండన్‌కు పారిపోయాడన్న అభియోగాలపై వజ్రాల వ్యాపారిని అప్పగించాలని భారత్‌ యూకే కోర్టులో పోరాడుతోంది. ప్రస్తుతం వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్న నీరవ్‌ మోదీని మంగళవారం వీడియో లింక్‌ ద్వారా కోర్టు విచారించనుంది.

ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ జడ్జి శామ్యూల్ గూజీ, నిందితులపై ప్రాథమిక కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) అందించిన కొన్ని సాక్ష్యాలపై న్యాయమూర్తి డిఫెన్స్‌ వాదనలు విననున్నారు. కాగా, భారత ప్రభుత్వం ఆరోపణలపై స్కాట్లాండ్ యార్డ్ జారీచేసిన వారెంటుపై 2019 మార్చి 19 న నీరవ్ మోదీని అరెస్టు చేశారు. 49 ఏండ్ల వయసున్న ఆయన.. అప్పటి నుంచి నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉంటున్నాడు.

గతంలో పలుమార్లు నీరవ్‌ మోదీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గత నెల 26న కేసు విచారణ జరగ్గా.. కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. రిమాండ్‌ను నవంబర్‌ 3వ తేదీ వరకు పొడగించింది. అంతకు ముందు నాలుగు సార్లు బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. అయితే.. నీరవ్‌ న్యాయవాది ఇంతకు ముందు లండన్‌ కోర్టుకు హాజరై.. భారతదేశంలో న్యాయమైన విచారణ జరిగే అవకాశం లేదని చెప్పారు.

తన కేసును రాజకీయం చేయడం, భారతీయ జైళ్లలో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో అతను ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం అధికంగా ఉన్నదని స్పష్టం చేశారు. అయితే ఆ వాదనలను భారత అధికారులు తోసిపుచ్చారు. మంగళవారం జరిగే విచారణలోనైనా యూకే కోర్టు నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరిస్తుందా? లేదా?  మరికొద్ది గంటల్లో తెలియనుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.