శనివారం 30 మే 2020
National - May 07, 2020 , 17:09:57

విశాఖ గ్యాస్ లీక్‌.. స్తంభించిన శ్రామిక్ రైళ్లు

విశాఖ గ్యాస్ లీక్‌.. స్తంభించిన శ్రామిక్ రైళ్లు

హైద‌రాబాద్‌: విశాఖ‌ప‌ట్ట‌ణంలో గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న వ‌ల్ల సుమారు 9 శ్రామిక్ రైళ్లు నిలిచిపోయాయి. సింహాచలం నార్త్ రైల్వే స్టేష‌న్ నుంచి వివిధ ప్రాంతాల‌కు వెళ్ల‌వ‌ల‌సిన రైళ్లు అక్క‌డే ఆగిపోయాయి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో చిక్కుకుపోయిన వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించేందుకు శ్రామిక్ రైళ్ల‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.  ఎల్‌జీ పాలిమ‌ర్స్ కెమిక‌ల్ ప్లాంట్ స‌మీపంలోనే సింహాచ‌లం రైల్వే స్టేష‌న్ ఉన్న‌ది. అయితే ప్ర‌మాద స‌మ‌యంలో రైల్వే సిబ్బంది కూడా శ్వాస‌కోస ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  కండ్లు కూడా మండిన‌ట్లు చెబుతున్నారు.  ఆ స్టేష‌న్ రూట్లో ఉద‌యం 8.35 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు రైళ్ల‌ను ఆపేశారు. అప్ డైర‌క్ష‌న్‌లో 24 గూడ్స్ రైళ్లు, డౌన్ డైర‌క్ష‌న్‌లో 12 రైళ్లు నిలిచిపోయాయి.   

విశాఖ‌ప‌ట్ట‌ణం నుంచి అబూ రోడ్ వెళ్లే శ్రామిక్ ట్రైన్‌తో పాటు వాల్టేర్ డివిజ‌న్ నుంచి ప్రారంభం అయ్యే రైళ్ల‌ను నిలిపేశారు.ద‌ర్బంగా నుంచి త్రిసూర్‌, హ‌తియా నుంచి ఎర్నాకుళం, స‌హ‌స్రా నుంచి చింత‌కుంట‌, పాలక్కాడ్ నుంచి జ‌గన్నాథ్‌పూర్ వెళ్లే వ‌ల‌స కూలీల‌ను రైళ్ల‌ను ఆపేశారు.  కొన్ని రైళ్ల‌ను విజ‌య‌వాడ‌, బ‌లార్ష రూట్ల‌లో మ‌ళ్లించారు. ఘ‌ట్కేస‌ర్ నుంచి క‌తిహార్‌, కాట్పాడి నుంచి హ‌తియా, లింగంప‌ల్లి నుంచి భ‌గ‌ల్‌పుర్‌, కోజికోడ్ నుంచి క‌తియార్ వెళ్లే శ్రామిక్ రైళ్ల‌ను దారిమ‌ళ్లించారు.logo