శనివారం 23 జనవరి 2021
National - Jan 10, 2021 , 11:55:48

భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నేవి

భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నేవి

చెన్నై : తమ దేశ జలాల్లోకి వచ్చి చేపలు పట్టారనే ఆరోపణలతో శ్రీలంక నావికాదళం తొమ్మిది మంది భారతీయ మత్స్సకారులను అరెస్టు చేసింది. అలాగే ఓ పడవను స్వాధీనం చేసుకుంది. సంఘటనలో చేపలు పట్టే వలలు దెబ్బతిన్నాయని ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ అధికారులు ఆదివారం తెలిపారు.  శనివారం నెదున్తీవు సమీపంలో మత్స్యకారులను అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జాలర్లందరూ రామేశ్వరానికి చెందిన వారని చెప్పారు.అలాగే మరో సంఘటనలో లక్కన్‌ నావికాదళ సిబ్బంది శనివారం కచ్చాతీవు సమీపంలో 20 మరపడవల్లోని చేపలు పట్టే వలలను ధ్వంసం చేశారని అధికారులు పేర్కొన్నారు. భారతీయ మత్స్యకారులపై రాళ్లు, సీసాలు కూడా విసిరినట్లు తెలిపారు. మత్స్యకారుల సంఘం ప్రతినిధి సేసురాజా శ్రీలంక నావికాదళ చర్యలను ఖండించారు. పరికరాలకు నష్టం జరగడం మత్స్యకారులకు బాధ కలిగించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 


logo