సోమవారం 13 జూలై 2020
National - May 06, 2020 , 13:45:46

గాంధీన‌గ‌ర్ రోడ్ల‌పై నీల్గాయి మంద‌..వీడియో

గాంధీన‌గ‌ర్ రోడ్ల‌పై నీల్గాయి మంద‌..వీడియో

లాక్ డౌన్ ప్ర‌భావంతో జ‌నాలు ఇండ్ల‌కు ప‌రిమిత‌మైతే..మూగ‌జీవాల‌కు మాత్రం స్వేచ్చ దొరికిన‌ట్టైంది. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఇపుడు ప్ర‌పంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తుండ‌గా..రోడ్లపై జ‌నాలు లేక‌పోవ‌డంతో వ‌న్య‌ప్రాణులు రోడ్ల‌పైకొస్తున్నాయి.

గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ వీధుల్లో నీల్గాయి (బ్లూ బుల్‌)గుంపు హ‌ల్ చ‌ల్ చేసింది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల‌పై నుంచి నీల్గాయిలు పెద్ద సంఖ్య‌లో ప‌రుగులు పెడుతున్న  వీడియో సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతోంది. లాక్ డౌన్ కాలంలో సింహాలు, పులులు, జింక‌లు, ఎలుగుబంట్లతోపాటు ఇత‌ర వన్య‌ప్రాణులు వీధుల్లో సంచ‌రిస్తున్న‌ ఘ‌ట‌న‌లు చూస్తూనే ఉన్నాం. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo