గురువారం 26 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 20:24:40

క‌రోనా ఎఫెక్ట్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌లో నైట్‌ క‌ర్ఫ్యూ

క‌రోనా ఎఫెక్ట్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌లో నైట్‌ క‌ర్ఫ్యూ

భోపాల్/‌జైపూర్: ‌క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విస్త‌రిస్తుండ‌టంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌లో రాష్ట్రాలు రాత్రి వేళ‌ల్లో క‌ర్ఫ్యూ విధించాల‌ని నిర్ణ‌యించాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కొన్ని జిల్లాల్లో న‌వంబ‌ర్ 21 నుంచి క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. ఇండోర్‌, భోపాల్‌, గ్వాలియ‌ర్‌, విదిశ, ర‌త్లామ్ జిల్లాల్లో రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధించనున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే అత్య‌వ‌స‌ర సేవ‌లు అవ‌స‌ర‌మైన వారికి, ఫ్యాక్ట‌రీల్లో విధులు నిర్వ‌హించే కార్మికుల‌కు మాత్రం ఈ క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఉంటుందని శివ‌రాజ్‌ చెప్పారు.

ఇక, గుజ‌రాత్‌లోనూ కరోనా క‌ట్ట‌డి కోసం రాత్రివేళ‌ల్లో క‌ర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి నితిన్ ప‌టేల్‌ వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 21 నుంచి రాజ్‌కోట్‌, సూర‌త్‌, వ‌డోద‌ర ప‌ట్ట‌ణాల్లో క‌ర్ఫ్యూ విధించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం ఆరు గంట‌ల వ‌ర‌కు ఈ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని చెప్పారు. అదేవిధంగా అహ్మ‌దాబాద్‌లో న‌వంబ‌ర్ 20 రాత్రి 9 గంట‌ల నుంచి న‌వంబ‌ర్ 23 ఉద‌యం 6 గంట‌ల‌కు సంపూర్ణంగా క‌ర్ఫ్యూను అమ‌ల్లోకి తెచ్చిన‌ట్లు నితిన్ ప‌టేల్‌ వెల్ల‌డించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.