సోమవారం 01 జూన్ 2020
National - May 23, 2020 , 16:09:18

పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు ఇరుగుపొరుగు ఘన స్వాగతం

పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు ఇరుగుపొరుగు ఘన స్వాగతం

ముంబై: ఇటీవల కరోనా బారినపడి పూర్తిగా కోలుకుని తిరిగొచ్చిన ముంబై పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఆయన నివసించే కాలనీలోని ఇరుగుపొరుగు వారు ఘనంగా స్వాగతం పలికారు. చప్పట్ల సప్పుళ్ల నడుమ పూల వర్షం కురిపిస్తూ ఆయనను సాధరంగా ఆహ్వానించారు. ముంబైకి చెందిన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్ కిరన్‌ పవా ఒషివారా పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించేవారు. అయితే ఇటీవల ఆయన కరోనా వైరస్‌ బారిన పడటంతో స్థానికంగా ఉన్న సెవెన్‌ హిల్స్ ఆస్పత్రిలో చేరారు. 14 రోజుల ఐసోలేషన్‌ అనంతరం పూర్తిగా కోలుకోవడంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనంతరం తాను నివసించే కాలనీకి చేరుకున్న ఇన్‌స్పెక్టర్‌కు కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు.


logo