బుధవారం 05 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 19:53:30

ప్రొఫెసర్‌ హనీబాబు నివాసంలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

ప్రొఫెసర్‌ హనీబాబు నివాసంలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

నోయిడా :  భీమా కోరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ హనీబాబు ఇంట్లో ఆదివారం  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నోయిడా ముసాలియార్వీటిల్ తరైయిల్ ప్రాంతంలోని హనీబాబు నివాసానికి చేరుకున్న(ఎన్ఐఏ) బృందం ఇంటిని పూర్తిగా శోధించింది. ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేసిన హనీబాబు(54)కు భీమా కోరేగావ్‌ కేసులో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఆగస్టు 4 వరకు రిమాండ్‌ విధించింది.

భీమా-కోరేగావ్ ఘటనకు 2018 జనవరి 1 నాటికి 200 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఘటనను స్మరించుకుంటూ ఎల్గార్ పరిషత్ పేరుతో కొందరు దళిత, వామపక్ష కార్యకర్తల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత చెలరేగిన హింసలో వ్యక్తి మృతి చెందగా 10 మంది పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 162 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో నోయిడాలోని హనీబాబు నివాసంలో పూణే పోలీసులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే.logo