శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 13:48:41

గ్రేట‌ర్‌ క‌శ్మీర్ ప‌త్రిక ఆఫీసులో ఎన్ఐఏ సోదాలు

గ్రేట‌ర్‌ క‌శ్మీర్ ప‌త్రిక ఆఫీసులో ఎన్ఐఏ సోదాలు

హైద‌రాబాద్‌:  ఎన్ఐఏ అధికారులు ఇవాళ జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌ది ప్రాంతాల్లో సోదాలు నిర్వ‌హించారు.  ఓ ఎన్జీవో, ట్ర‌స్టు సంబంధిత కేసులో ఈ త‌నిఖీలు జ‌రిగాయి.  సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం నిధులు సేక‌రించిన ఆ ఎన్జీవో .. వేర్పాటువాద కార్య‌క‌లాపాల కోసం ఆ నిధుల‌ను వాడిన‌ట్లు  ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  శ్రీన‌గ‌ర్‌, బందిపురాతో పాటు బెంగుళూరులోని ఓ లొకేష‌న్‌లో సోదాలు జ‌రిగిన‌ట్లు ఎన్ఐఏ వెల్ల‌డించింది.  ఈ సోదాల్లో భాగంగానే గ్రేట‌ర్ క‌శ్మీర్ ప‌త్రిక ఆఫీసులో కూడా త‌నిఖీలు జ‌రిగాయి. క‌శ్మీర్ ఉద్య‌మ కార్య‌క‌ర్త ఖుర్హ‌మ్ ప‌ర్వేజ్‌ ఇంట్లోనూ సోదాలు జ‌రిగిన‌ట్లు అధికారులు చెప్పారు. ఎన్జీవో నిధుల దుర్వినియోగం కింద ఎన్ఐఏ కొత్త కేసు న‌మోదు చేసింది. హ‌వాలా రాకెట్‌, నిధుల అక్ర‌మ వినియోగం, టెర్ర‌ర్ ఫండింగ్ ఆరోప‌ణ‌ల కింద ఎన్జీవోను సోదా చేశారు.  

2016లో ఖుర్హ‌మ్ ప‌ర్వేజ్‌ను అరెస్టు చేశారు. శ్రీన‌గ‌ర్‌లో ని ఇంట్లో నుంచి ఆయ‌న్ను అప్పుడు అదుపులోకి తీసుకున్నారు.  76 రోజుల నిర్బంధం త‌ర్వాత సెష‌న్స్ కోర్టు ఆదేశాల ప్ర‌కారం రిలీజ్ చేసినా.. మ‌ళ్లీ ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్ర‌కారం అదుపులోకి తీసుకున్నారు.  2019లో గ్రేట‌ర్ క‌శ్మీర్ ఎడిట‌ర్ ఫ‌యాజ్ ఖాలూను ఎన్ఐఏ పోలీసులు విచారించారు.  మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త ఖుర్హ‌మ్ ప‌ర్వేజ్‌, గ్రేట‌ర్ క‌శ్మీర్ ఆఫీసుల‌పై జ‌రిగిన ఎన్ఐఏ సోదాల‌ను మాజీ సీఎం మొహ‌బూబా ముఫ్తీ ఖండించారు. భావ‌స్వేచ్ఛ‌, అస‌మ్మ‌తిపై కేంద్ర ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపిన‌ట్లు ఆమె ఆరోపించారు. బీజేపీ పెంపుడు ఏజెన్సీగా ఎన్ఐఏ మారిన‌ట్లు ఆమె విమ‌ర్శించారు.