శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 18:54:49

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ఆరుగురు అరెస్ట్

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ఆరుగురు అరెస్ట్

తిరువనంతపురం: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ఆరుగురు అరెస్ట్ అయ్యారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య పదికి చేరింది. దుబాయ్ నుంచి కేరళకు దౌత్య మార్గంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిన ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు జరుపుతున్నది. ఈ కేసులో నలుగురు నిందితులైన సరిత్, స్వప్న సురేశ్, సందీప్ నయ్యర్ తోపాటు మరో వ్యక్తిని తొలుత ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ కేసునకు సంబంధించి ఈ వారం మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. అలాగే ఆరు చోట్ల తనిఖీలు జరిపినట్లు వెల్లడించింది.

ఎర్నాకుళంలోని ఇద్దరు నిందితులు జలాల్ ఏఎం, రాబిన్స్ హమీద్, మలప్పురంలో రమీస్ కేటీ, మహ్మద్ షఫీ, సయీద్ అల్వీ, అబ్దు పీటీల నివాసాలలో ఆదివారం శోధాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ తెలిపింది. వారికి చెందిన 2 హార్డ్ డిస్క్‌లు, 1 టాబ్లెట్ పీసీ, 8 మొబైల్ ఫోన్లు, 6 సిమ్ కార్డులు, 1 డిజిటల్ వీడియో రికార్డర్, 5 డీవీడీలతోపాటు బ్యాంక్ పాస్‌బుక్‌లు, క్రెడిట్ , డెబిట్ కార్డులు, ప్రయాణ పత్రాలు, నిందితుల గుర్తింపు కార్డులతో సహా పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ వివరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు పది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది.logo