బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 17:25:33

కేరళ సీఎం మాజీ ప్రధాన కార్యదర్శి శివశంకర్‌కు ఎన్ఐఏ సమన్లు

కేరళ సీఎం మాజీ ప్రధాన కార్యదర్శి శివశంకర్‌కు ఎన్ఐఏ సమన్లు

తిరువనంతపురం: కేరళలో కలకలం రేపిన బంగారం అక్రమ రవాణా కేసులో సీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ఎం శివశంకర్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సమన్లు జారీ చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విచారణకు ఈ నెల 27న కోచిలోని ఎన్ఐఏ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో రెండో నిందితురాలైన స్వప్న సురేశ్‌తో సంబంధాలున్నాయని ఆరోపణలున్న శివశంకర్‌ను ఎన్ఐఏ అధికారులు గురువారం ఐదు గంటలపాటు ప్రశ్నించారు. మరోవైపు సీఎం విజయన్‌కు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నదని ఆరోపిస్తున్న ఆ రాష్ట్ర ప్రతిపక్షాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.


logo