ఈ రోజుల్లో సినిమాలకు సోలో రిలీజ్ డేట్స్ దొరకడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా కన్ఫర్మ్ చేసిన సినిమాలను కూడా మళ్లీ వెనక్కి తీసుకెళ్లిపోయారు నిర్మాతలు. చాలా వరకు సినిమాలను వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే నాని టక్ జగదీష్.. నాగ చైతన్య లవ్ స్టోరీ లాంటి సినిమాల రిలీజ్ వాయిదా పడింది. వకీల్ సాబ్ తర్వాత ఏ తెలుగు నిర్మాత కూడా తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు చూసిన తర్వాత కూడా సినిమాలను విడుదల చేయాలని ఎవరూ అనుకోవడం లేదు.
అయితే కొన్ని చిన్న సినిమాలు మాత్రం దొరికిందే ఛాన్స్ అనుకుని రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా ఉందని తెలిసినా కూడా తమ సినిమాలను విడుదల చేస్తే చాలు అనుకుంటున్నారు నిర్మాతలు. అందుకే లవ్ స్టోరీ, టక్ జగదీష్ ఖాళీ చేసిన ఏప్రిల్ 16, 23 తేదీలను వాళ్లు తీసుకున్నారు. లవ్ స్టోరీ రావాల్సిన ఈ వారం.. మరో నాలుగు సినిమాలు వస్తున్నాయి. కనీసం అలాంటి సినిమాలు ఉన్నాయని కూడా ప్రేక్షకులకు తెలియదు. అందులో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో రెండేళ్ల కింద రాజశేఖర్ తో తెరకెక్కించిన దెయ్యం కూడా ఉంది. ఈ సినిమాకు అప్పట్లో పట్టపగలు అనే టైటిల్ పెట్టాడు. అప్పుడు ఈ సినిమా విడుదల కాలేదు.. దాన్నే ఇప్పుడు దెయ్యంగా తీసుకొస్తున్నాడు. ఆర్జీవీ దెయ్యంతో పాటు మరో మూడు చిన్న సినిమాలు ఈ వారం కూడా వస్తున్నాయి.
ఇక ఏప్రిల్ 23న టక్ జగదీష్ సినిమాతో నాని రావాలనుకున్నాడు. ఆయన ఖాళీ చేయడంతో ఇప్పుడు అదే తేదీన ఇష్క్ సినిమా వస్తుంది. జాంబి రెడ్డి ఫేమ్ తేజ సజ్జ ఇందులో హీరో. ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించింది. ఆర్బీ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల కానుంది. కరోనా కేసుల మధ్య ఇప్పుడు తీసుకొచ్చినా కూడా ఆడియన్స్ రారు అని తెలిసినా కూడా తీసుకొస్తూనే ఉన్నారు నిర్మాతలు. అయితే పెద్ద సినిమాలు మాత్రం వరసగా వాయిదా పడుతూనే ఉన్నాయి. అందులో ఆచార్య లాంటి సినిమాలు కూడా ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అంజలి .. ఈసారైనా నిలదొక్కుకుంటుందా
అఖండ బ్లాక్ బస్టర్.. నారా లోకేష్ ట్వీట్
ఫెస్టివల్ లుక్‌లో సాయిపల్లవి..న్యూ పోస్టర్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..
ఓటీటీలో వకీల్ సాబ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!
బాయ్‌ఫ్రెండ్‌తో ఐరాఖాన్ బాక్సింగ్..వీడియో వైరల్
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వీక్ డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..?
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!