శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 14:04:32

ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ

ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ

బెంగళూర్‌ :  కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో బుధవారం ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డారు.  నగరంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు బృందం ( ఎన్‌ఐఏ) ఇంటిపై దాడి చేసి ఇద్దరిని పట్టుకుంది. ఈ ఇద్దరికి ఐఎసీఎస్‌తో సంబంధాలు ఉన్నట్లు ఎస్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. వీరిని విచారిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. 

గత 20 రోజుల క్రితం ఐసీఎస్‌తో సంబంధమున్న ఇద్దరిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిని తమిళనాడుకు చెందిన అబ్దుల్ అహ్మద్ క‌దీర్ (40), బెంగ‌ళూరుకు చెందిన ఇర్ఫాన్ న‌జీర్‌గా గుర్తించారు. ఇటీవల బెంగళూర్‌లో  ఉగ్రవాద స్థావరం బయటపడినాటి నుంచి ఎన్‌ఐఏ పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది. పట్టుబడిన వారి నుంచి తీగలాగి ఉగ్రవాదులను అరెస్టు చేస్తోంది. వరుసగా బెంగళూర్‌లో ఉగ్రవాదులు పట్టుబడుతుండటం నగరంలో కలకలం రేపుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.