మంగళవారం 31 మార్చి 2020
National - Feb 29, 2020 , 01:01:28

ఆన్‌లైన్‌లో‘ పుల్వామా’ పేలుడు సామగ్రి కొనుగోలు

ఆన్‌లైన్‌లో‘ పుల్వామా’ పేలుడు సామగ్రి కొనుగోలు
  • ఎన్‌ఐఏ విచారణలో వెల్లడించిన ఉగ్రవాది

న్యూఢిల్లీ: గతేడాది ఫిబ్రవరిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న ‘పుల్వామా’ ఉగ్రదాడికి ఉపయోగించిన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌) పేలుడు సామగ్రిని ముష్కరులు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా కొనుగోలు చేసినట్లు తేలింది. దాడికి కుట్రపన్నిన జైషే మహమ్మద్‌ సంస్థకు చెందిన ఉగ్రవాది షాకీర్‌ బషీర్‌ మాగ్రేని అరెస్ట్‌ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు.. అతడి నుంచి కీలక వివరాలు రాబట్టారు. ఐఈడీ తయారీకి వాడిన బ్యాటరీ, అమ్మోనియం నైట్రేట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు షాకీర్‌ వెల్లడించాడని ఒక అధికారి తెలిపారు. దాడికి ఉపయోగించిన మారుతీ ఎకో వాహనాన్ని తొలుత తానే నడిపానని, కాన్వాయ్‌ 500 మీటర్ల దూరంలో ఉందనగా తాను దిగిపోయి మరో ఉగ్రవాది అదిల్‌ దార్‌కు అప్పగించినట్లు షాకీర్‌ వెల్లడించాడన్నారు. అదిల్‌ దార్‌ ఆ వాహనాన్ని సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ మీదకు పోనిచ్చి తనను తాను పేల్చేసుకున్నట్లు తెలిపారు. షాకీర్‌ను గురువారం ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా.. విచారణ నిమిత్తం కోర్టు అతడిని 15 రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించింది. అదిల్‌తోపాటు మరో ఉగ్రవాది ఉమర్‌ ఫరూఖ్‌కు షాకీర్‌ ఆశ్రయం కల్పించినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. logo
>>>>>>