ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 16:38:08

ల‌ష్క‌ర్‌-ఇ-తోయిబా సానుభూతిప‌రుడు అరెస్టు

ల‌ష్క‌ర్‌-ఇ-తోయిబా సానుభూతిప‌రుడు అరెస్టు

బెంగ‌ళూరు : పశ్చిమ బెంగాల్ ఎల్ఈటీ రిక్రూట్‌మెంట్ కేసులో లష్కర్‌-ఇ-తోయిబా (ఎల్‌ఇటి) కు చెందిన సానుభూతిప‌రుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బుధవారం క‌ర్ణాట‌క‌లో అరెస్టు చేసింది. ఉత్త‌ర క‌న్న‌డ‌కు చెందిన 28 ఏళ్ల స‌య్య‌ద్ ఇద్రిస్ అనే వ్య‌క్తిని ఎన్ఐఏ కర్ణాటకలో అరెస్టు చేసింది. గ‌డిచిన మార్చి 18న ప‌శ్చిమ బెంగాల్‌లోని బ‌దౌరియా పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్ల‌ర్లు వివిధ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫారాల‌ను ఉప‌యోగించి స్థానికంగా స్లీప‌ర్ సెల్స్‌ను రిక్రూట్ చేసేందుకు య‌త్నించారు. అరెస్టు అయిన నిందితుడు పాకిస్తాన్‌కు చెందిన ఎల్‌ఇటి హ్యాండ్లర్లు నిర్వహిస్తున్న వివిధ సోషల్ మీడియా గ్రూపులలో స‌భ్యుడిగా ఉన్నాడు. ఎల్‌ఇటి స్లీపర్ సెల్స్ కోసం అదేవిధంగా ఉగ్రవాద కార్యకలాపాల నిమిత్తం వ్యక్తులను నియమించే ప్రయత్నం చేశాడు. నిందితుడిని ఉత్తర కన్నడ కోర్టులో హాజరుపర‌చ‌నున్నారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై కోల్‌కతాలోని ఎన్‌ఐఏ కోర్టుకు త‌ర‌లించ‌నున్నారు. ఈ కేసులో  కోల్‌కతాలో నివసిస్తున్న నిందితురాలు తానియా పర్విన్‌పై సెప్టెంబర్ 10న ఇప్పటికే చార్జిషీట్ దాఖలైంది. కేసులో తదుపరి విచార‌ణ కొనసాగుతోంద‌ని అధికారులు వెల్ల‌డించారు.