సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 06:53:00

రాబోయే మూడు నెలలు నిర్ణయాత్మకం : కేంద్రమంత్రి

రాబోయే మూడు నెలలు నిర్ణయాత్మకం : కేంద్రమంత్రి

న్యూఢిల్లీ : కొవిడ్‌ పరిస్థితిని నిర్ణయించడంలో వచ్చే మూడు నెలలు నిర్ణయాత్మకంగా ఉండబోతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ అన్నారు. రాబోయే పండుగలు, శీతాకాలం నేపథ్యంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు. యూపీ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరణాల రేటు తక్కువగా ఉండేందుకు పరీక్ష, నిఘా, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ముందస్తు రోగ నిర్ధారణపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. యూపీ వంటి పెద్ద రాష్ట్రంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు.

కొవిడ్‌తో రోగ నిరోధకశక్తిని కోల్పోయిన పిల్లలకు టీకాలు వేయడానికి యూపీ చేసిన కృషిని కేంద్రమంత్రి ప్రశంసించారు. గడిచిన మూడు నెలల్లో దేశం కొవిడ్‌లో గణనీయమైన మెరుగుదలను చూసిందని కేంద్రమంత్రి తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షల కంటే తక్కువగా ఉందని, రెట్టింపు రేటు 97.2 రోజులకు పెరిగిందని, వైరస్‌ సంక్రమణ సమయంలో కేవలం ఒకే ల్యాబ్‌ ఉండేదని, ఇప్పుడు 2వేల ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పటి వరకు పదికోట్లకుపైగా పరీక్షలు చేశామని, సరైన దిశలో పయనిస్తున్నామని చెప్పేందుకు ఇది సానుకూల సూచన అని పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.