శనివారం 06 జూన్ 2020
National - May 14, 2020 , 03:20:44

వచ్చీరాగానే బిస్కట్లు మాయం!

వచ్చీరాగానే బిస్కట్లు మాయం!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను పొడిగిస్తారన్న వార్తల నేపథ్యంలో కిరాణం, సూపర్‌ మార్కెట్లలో ఉన్న బిస్కట్లు, స్నాక్స్‌, నూడుల్స్‌ తదితర వస్తువులకు డిమాండ్‌ ఏర్పడింది. స్టాక్‌ వచ్చీ రాగానే అరల్లోని సరుకులు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. పరిమిత సంఖ్యలో సిబ్బంది విధుల్లోకి వస్తుండటంతో వీటి ఉత్పత్తి తగ్గిందని కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.


logo