సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 11:38:27

టిక్‌టాక్‌ వీడియో కోసం స్టంట్లు.. యువకుడు మృతి

టిక్‌టాక్‌ వీడియో కోసం స్టంట్లు.. యువకుడు మృతి

లక్నో : టిక్‌టాక్‌ వీడియోల కోసం సాధ్యం కాని స్టంట్లను కూడా యూత్‌ చేస్తోంది. కొన్నిసార్లు ఆ స్టంట్లు ప్రాణాల మీదకు వస్తున్నాయి. అసాధ్యమైన స్టంట్లు చేసి యువత ప్రాణాలు కోల్పోయిన సంగతులు కూడా ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు టిక్‌టాక్‌ వీడియో కోసం స్టంట్‌ చేసి.. ప్రాణాలు కోల్పోయాడు. ముజఫర్‌నగర్‌ జిల్లా పరిధిలోని కింధిదియా గ్రామానికి చెందిన కపిల్‌(23)కు రెండు నెలల క్రితం వివాహమైంది. అయితే కపిల్‌కు ట్రాక్టర్‌ నడపడం విపరీతమైన మోజు. దీంట్లో భాగంగా బుధవారం ట్రాక్టర్‌ నడుపుతూ టిక్‌టాక్‌ వీడియో కోసం స్టంట్‌ చేశాడు. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ ముందు చక్రాలను గాల్లోకి లేపేందుకు ప్రయత్నించగా, అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కపిల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వీడియోను చిత్రీకరిస్తున్న వ్యక్తికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. 


logo