బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 14:16:15

ఈనెల 22న నూతన రాజ్యసభ ఎంపీల ప్రమాణస్వీకారం

ఈనెల 22న నూతన రాజ్యసభ ఎంపీల ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ:   రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యుల  ప్రమాణస్వీకారం కార్యక్రమం ఈనెల 22న జరగనుంది.   నూతన ఎంపీలతో  రాజ్యసభ ఛైర్మన్‌  వెంకయ్య నాయుడు   ప్రమాణం చేయించనున్నారు.    రాజ్యసభ ఛాంబర్‌లో సభ్యుల ప్రమాణస్వీకారం  జరగనుండటం ఇదే తొలిసారి.  నూతనంగా ఎన్నికైన 61 మంది ఎంపీల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

కరోనా వైరస్‌ నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం తదితర నిబంధనలకు అనుగుణంగా ప్రమాణస్వీకారం ఉంటుందని ఓ అధికారి తెలిపారు.  సాధారణంగా నూతన సభ్యుల ప్రమాణస్వీకారం.. సమావేశాలు జరుగుతున్నప్పుడు రాజ్యసభలో లేదా సమావేశాలు లేనప్పుడు రాజ్యసభ ఛైర్మన్‌ ఛాంబర్‌లో   నిర్వహిస్తారు.  


logo