బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 20:19:56

పంజాబ్‌లో కొత్తగా 414 కరోనా కేసులు

పంజాబ్‌లో కొత్తగా 414 కరోనా కేసులు

చండీఘర్ : కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. తాజాగా పంజాబ్‌లో గడిచిన 24 గంటల్లో 414 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11301కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 269కి చేరింది. ఇప్పటివరకు 7,641 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి తెలియజేశారు. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo