శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 20, 2020 , 17:53:07

సరికొత్త ఆఫర్ : ఆరు నెలలు ఈఎంఐ లేకుండా కారు

 సరికొత్త ఆఫర్ : ఆరు నెలలు ఈఎంఐ లేకుండా కారు

బెంగళూరు: కరోనా నేపథ్యంలో కంపెనీలు, వ్యాపారులకు ఆదాయం లేకపోవడం, ఉద్యోగులకు వేతనం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసిన మోడల్ వాహనాలపై టాటా మోటార్స్ కూడా ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. టియాగో, నెక్సాన్, ఆల్ ట్రెజ్ కార్లు కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కరూర్ వైశ్య బ్యాంకు (కెవిబి)తో కలిసి టాటా మోటార్స్ ఈ సరికొత్త ఆరు నెలల ఈఎంఐ మారటోరియం పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకంలో భాగంగా ఆరు నెలల వరకు ప్రతి నెల వడ్డీ చెల్లిస్తే చాలు. ఈ కాలంలో ఈఎంఐ చెల్లించవలసిన అవసరం లేదు. ప్రస్తుత కరోనా టైంలో వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఎంతో వెసులుబాటు కలిగిన స్కీంగా చెబుతున్నారు.

ఈఎంఐ మారటోరియం స్కీంతో పాటు ఇతర ఫైనాన్షియల్ స్కీమ్స్‌ను కూడా టాటా మోటార్స్ ఆఫర్ చేస్తున్నది. ఈఎంఐ మారటోరియంతో పాటు ఎంపిక చేసిన ఉద్యోగులు లేదా స్వయంఉపాధి కలిగిన వారు జీరో డౌన్ పేమెంట్‌తో వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ఇందుకు ఈ కంపెనీ దేశంలోని సుదీర్ఘ అనుభవం కలిగిన కేవీబీ బ్యాంకు ద్వారా ఐదేండ్ల కాలపరిమితితో వాహన రుణాన్ని అందిస్తున్నది. ప్రస్తుత కరోనా సమయంలో చాలామంది వ్యక్తిగత వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే సామాజిక దూరం తప్పనిసరి. ఇందుకు వాహనాల సేల్స్ రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు.

ఇప్పటికే సెకండ్ హ్యాండ్ వాహనాల సేల్స్ పెరిగాయి. కొత్త వాహనాల సేల్స్ కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తమ స్కీం సహకరిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది. ఉద్యోగ అనిశ్చితుల నేపథ్యంలో తమ పథకం ఉద్యోగులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నది. ఈ కొత్త పథకంతో పాటు టాటా మోటార్స్ లాంగ్ టెన్యూర్ లోన్‌లో భాగంగా ఎనిమిదేళ్ల ఈఎంఐ అందిస్తున్నది. ఇందుకు వివిధ బ్యాంకులతో జత కట్టింది. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హాచ్‌బ్యాక్ ప్రారంభ ఈఎంఐ రూ.5,555, నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, బ్రాండ్ ఎంట్రీ లెవల్ మోడల్ టియాగో ప్రారంభ ఈఎంఐ వరుసగా రూ.7,499, రూ.4,999గా ఉన్నది.logo