శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 16:20:40

జ‌న‌తా కర్ఫ్యూ రోజున జ‌న‌నం.. క‌రోనా నామ‌క‌ర‌ణం

జ‌న‌తా కర్ఫ్యూ రోజున జ‌న‌నం.. క‌రోనా నామ‌క‌ర‌ణం

ల‌క్నో : క‌రోనా మ‌హమ్మారి నియంత్ర‌ణ‌కు ఈ నెల 22న జ‌న‌తా క‌ర్ఫ్యూను పాటించిన విష‌యం తెలిసిందే. అదే రోజున యూపీలోని గోర‌ఖ్ పూర్ కు చెందిన రాగిణి త్రిపాఠి అనే గ‌ర్భిణి.. పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. రాగిణి ద‌గ్గ‌రి బంధువు నితీష్ త్రిపాఠి కొంచెం వినూత్నంగా ఆలోచించాడు. ఆ బిడ్డ‌కు క‌రోనా అని నామ‌క‌ర‌ణం చేశాడు. అది కూడా త‌ల్లి రాగిణి అనుమ‌తి తీసుకొని. జ‌న‌తా కర్ఫ్యూ రోజున జ‌న్మించినందుకు.. క‌రోనాపై ప్ర‌జ‌లంద‌రూ ఐక్య‌త‌తో పోరాటం చేస్తున్నందుకే గుర్తుగా క‌రోనా అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు నితీష్ చెప్పాడు. 

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విస్త‌రించింది. క‌రోనా నియంత్ర‌ణకు భార‌త‌దేశంలో ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ప్ర‌జ‌లు స్వీయ నియంత్ర‌ణ పాటిస్తున్నారు. సామాజిక దూరాన్ని కూడా అమ‌లు చేస్తున్నారు. 


logo