శనివారం 30 మే 2020
National - May 22, 2020 , 10:00:38

హెలికాప్ట‌ర్ మ‌నీపై.. న్యూజిలాండ్ క‌స‌ర‌త్తు

హెలికాప్ట‌ర్ మ‌నీపై.. న్యూజిలాండ్ క‌స‌ర‌త్తు

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్‌తో ఏర్ప‌డిన లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌పంచ‌దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ అత‌లాకుత‌లం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో హెలికాప్ట‌ర్ మ‌నీ కావాల‌న్న డిమాండ్‌లు వ‌స్తున్నాయి.  నిజానికి హెలికాప్ట‌ర్ మ‌నీ విధానం గురించి చాలా వ‌ర‌కు ప్ర‌పంచ‌దేశాలు ఆలోచిస్తున్నాయి. న్యూజిలాండ్ కూడా ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వ‌ల్ల కివీస్ ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ది.  నీరుగారిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఉద్దీప‌న చేయ‌డ‌మే ఇప్పుడు ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. దీనిలో భాగంగా ప్ర‌జ‌ల‌కు నేరుగా ఉచితంగా డ‌బ్బును పంపిణీ చేయాల‌ని న్యూజిలాండ్ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబ‌ర్ట్‌స‌న్ తెలిపారు.  

హెలికాప్ట‌ర్ మ‌నీ గురించి ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌ణాళిక‌ల‌ను వెల్ల‌డించాల‌ని ఆర్థిక మంత్రి రాబ‌ర్ట్‌స‌న్‌ను ఇటీవ‌ల మీడియా స‌మావేశంలో అడిగారు. కివీస్ సెంట్ర‌ల్ బ్యాంకు డ‌బ్బును ముద్రించి, పంపిణీ చేస్తుందా అని రిపోర్ట‌ర్లు అడిగారు. లేదంటే ప్ర‌భుత్వమే సెంట్ర‌ల్ బ్యాంక్ నుంచి డ‌బ్బును రుణంగా తీసుకుని, త‌మ చేతుల మీదుగా ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తుందా అని ప్ర‌శ్నించారు. అయితే హెలికాప్ట‌ర్ మ‌నీ కాన్సెప్ట్‌పై ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నాని, ఆ స్థాయిలో దాని గురించి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేద‌న్నారు. ప్ర‌స్తుతానికి  ఆర్థిక ప‌ర‌ప‌తి విధాన‌మే అమ‌లులో ఉంటుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. d.

క‌రోనాతో ఆర్థిక వ్య‌వ‌స్థలు చిన్నాభిన్నం కావ‌డంతో వ‌ల్ల  హెలికాప్ట‌ర్ మ‌నీ కాన్సెప్ట్‌పై అంద‌రి దృష్టిప‌డింది. ఆర్థిక‌వేత్త‌లు, విధాన‌క‌ర్త‌లు దీని గురించి చ‌ర్చిస్తున్నారు. సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ఇదే మార్గ‌మ‌న్న అభిప్రాయానికి వ‌స్తున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు సంప‌న్న దేశాలు మాత్రం ఈ విధానంపై ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ ప‌ద్ధ‌తి వ‌ల్ల సెంట్ర‌ల్ బ్యాంకు స్వ‌యంప్ర‌తిప‌త్తి దెబ్బ‌తినే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆలోచిస్తున్నారు. దీర్ఘ‌కాలంలో ఇది ద్ర‌వ్యోల్బ‌ణానికి దారి తీస్తుంద‌న్న భ‌యాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల న్యూజిలాండ్ ఆర్థిక వ్య‌వ‌స్థ దాదాపు 21.8 శాతం కుంచించుకుపోనున్న‌ది. ఈ నేప‌థ్యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ భారీ సంస్క‌ర‌ణ‌ల‌కు ఊతం ఇవ్వ‌నున్న‌ది. కివీస్ రిజ‌ర్వ్ బ్యాంక్ త‌న క్యాష్ రేటును అత్య‌ల్పంగా 0.25 శాతానికి త‌గ్గించింది. బాండ్లు కొనుగోలు రేట్ల‌ను రెండింత‌లు పెంచింది. క‌రోనా వైర‌స్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్‌.. ఇక హెలికాప్ట‌ర్ మ‌నీపైనే ఆశ‌లు పెట్టుకున్న‌ది. 


logo