శనివారం 23 జనవరి 2021
National - Dec 30, 2020 , 13:30:13

న్యూ ఇయర్‌ ఆఫర్‌.. జీవితాంతం ఫ్రీగా సినిమా..!

న్యూ ఇయర్‌ ఆఫర్‌.. జీవితాంతం ఫ్రీగా సినిమా..!

పాట్నా : కొత్త సంవత్సరం నుంచి ఇక సినిమా హాల్లో జీవితాంతం ఉచితంగా సినిమా చూడొచ్చు. అవును మీరు చదివింది నిజమే.. ఎంతమందైనా వెళ్లొచ్చు.. అయితే సామాన్య ప్రజల కోసం కాదండోయ్‌.. కేవలం త్రివిధ దళాలకు చెందిన సైనికులకు మాత్రమే. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసే సైనికులు ఎవరైనా సరే థియేటర్‌కు వెళ్లి తమ ఐడీకార్డును చూపించి సినిమా చూడొచ్చు. ఇంతకీ ఈ ఆఫర్‌ ఇచ్చింది బీహార్‌ రాష్ట్రంలోని పాట్నాలోని రెజెండ్ థియేటర్‌ యజమాని. ఈ సందర్భంగా థియేటర్‌ ఓనర్‌ సుమన్‌ కే సిన్హా మాట్లాడుతూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన సైనికులకు ఉచితంగా వినోదాన్ని పంచడం ఆనందంగా ఉందన్నారు. తాను దాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

దేశ సేవలో ఉండే సైనికులకు వినోదం అందించడం నా బాధ్యతగా భావించానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సైనికులంతా థియేటర్‌కు వచ్చి.. హాయిగా సినిమాను వీక్షించాలని సుమన్‌ కే సిన్హా కోరారు. ఈ కొత్త ఆఫర్‌ వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వస్తుందని, పాట్నాలోని దనాపూర్‌ రెజిమెంట్‌లో సుమారు 1200 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. అలాగే వేల సంఖ్యలో పదవీ విరమణ చేసిన సైనికులు ఉన్నారు. ఇకపై వారంతా సదరు థియేటర్‌కు వెళ్లి ఫ్రీగా సినిమా చూడొచ్చు. ఇదిలా ఉండగా.. దేశంలో ఇలాంటి ప్రకటన రావడం ఇదే తొలిసారి. సైనికుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సైనికులు స్వాగతిస్తున్నారు. 


logo