మంగళవారం 19 జనవరి 2021
National - Dec 23, 2020 , 01:45:13

కొత్త తిమింగలాలు!

కొత్త తిమింగలాలు!

న్యూఢిల్లీ: పశ్చిమ హిందూ మహాసముద్రంలో కొత్త జాతి నీలి తిమింగలాల ఉనికి ఉందని చెప్పే ఆధారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సముద్రంలో రికార్డు చేసిన శబ్దాలను విశ్లేషించడం ద్వారా ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘నీలి తిమింగలాలు చాలా చిన్నగా పాడుతుంటాయి. కొత్త రకం తిమింగలాలకు మాత్రం వాటికంటూ ప్రత్యేకమైన పాట ఉంది. దీని ఆధారంగానే వాటిని గుర్తించామ’ని పరిశోధకులు తెలిపారు.