మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 21:23:37

చెవి వెనుక ఉండే మ‌స్టాయిడ్ ద్వారా కూడా క‌రోనా వ‌స్తుంది!

చెవి వెనుక ఉండే మ‌స్టాయిడ్ ద్వారా కూడా క‌రోనా వ‌స్తుంది!

ఇప్ప‌టివ‌ర‌కు తుమ్మ‌డం, ద‌గ్గ‌డం, మాట్లాడ‌డం వంటి వాటి ద్వారానే శ‌రీరంలో ఉండే క‌రోనా ఇత‌రుల‌‌కు వ్యాపిస్తుంద‌ని మాత్ర‌మే తెలుసు. ఇప్పుడు ప‌రిశోధ‌న‌లో తేలిన విష‌యం తెలిస్తే షాక్ అవుతారు. అదేంటంటే.. చెవి లోప‌ల‌, చెవి వెనుక భాగంలో ఉండే మ‌స్టాయిడ్.. అదేనండి బోలు ఎముక పైన కూడా క‌రోనా ఉంద‌ని వెల్ల‌డైంది. ఈ విష‌యం తాజాగా అధ్య‌యనం చేసిన శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.

వైర‌స్ సోకి మ‌ర‌ణించిన ముగ్గురి మీద ప‌రిశోధ‌న‌లు చేసిన త‌ర్వాత ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. చ‌నిపోయిన వారి నుంచి మ‌స్టాయిడ్లు, చెవుల నుంచి న‌మూనాల‌ను సేక‌రించి మ‌రీ ప‌రీక్ష‌లు చేశారు. ఈ ప‌రిశోధ‌న‌కు చాలా స‌మ‌యం ప‌ట్టిందంటున్నారు. రోజురోజుటికి క‌రోనా అప్‌డేట్స్ ప‌రిగిపోతున్నాయి. ఎప్పుడు ఏం విష‌యం వినాల్సి వ‌స్తుందో అని భ‌య‌ప‌డుతున్నారు. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం పోయి ఇప్పుడు మ‌రో కొత్త అప్‌డేట్‌. జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని చెప్ప‌డం క‌న్నా ఏం చేయ‌లేం.logo