శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 15:10:20

కాంగ్రాలో స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు

కాంగ్రాలో స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు

సిమ్లా : హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కాంగ్రా జిల్లాలో త్వరలోనే క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నూత‌నంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆ రాష్ర్ట‌ అటవీ, యువజన సేవలు, క్రీడాశాఖ మంత్రి రాకేశ్ పఠానియా తెలిపారు. పాలంపూర్‌లో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి శాంత కుమార్‌ను ఆయన మర్యాదపూర్వకంగా క‌లిశారు. కాంగ్రా జిల్లాలోని నూర్పూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పఠానియాను జులై 30న సీఎం జై రామ్ ఠాకూర్ మంత్రివర్గంలో చేరారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ... కాంగ్రా జిల్లాలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. 

ఇది హిమాచల్ ప్రదేశ్‌లోనే క్రీడలకు ఒక అద్భుత కేంద్రంగా మార‌నుంద‌న్నారు. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే సీఎం జై రామ్ ఠాకూర్‌కు సైతం తాను విన్న‌వించిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్ర‌తిభావంతులైన యువ‌త ఉంద‌ని వారి శ‌క్తి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్నికూడా పెంచుతామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అడవులను చూసేందుకు ప్రజలు వస్తారన్నారు.


logo