శుక్రవారం 05 జూన్ 2020
National - Feb 03, 2020 , 01:36:26

నోరూరిస్తున్న సూర్యుడు!

నోరూరిస్తున్న సూర్యుడు!

న్యూఢిల్లీ: ఈ చిత్రంలో కనిపిస్తున్నది పల్లిపట్టీ కాదు. భగభగమండే సూర్యుడు. సూర్యుడి ఉపరితలాన్ని మునుపెన్నడూ లేనంత స్పష్టంగా చూపే అందమైన చిత్రాలు, వీడియోలను నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌) ఇటీవల విడుదల చేసింది. సూర్యుడి ఉపరితలంపై భగభలాడుతున్న ప్లాస్మాను ఇవి క్లోజప్‌లో చూపిస్తున్నాయి. ఈ దృశ్యాలు పల్లిపట్టీల మాదిరిగా, క్యారమిల్‌ చాక్లెట్‌ మాదిరిగా నోరూరించేలా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తునాన్నారు. సూర్యుని ఉపరితలంపై కణాల్లాంటి ఆకృతుల్లో ప్లాస్మా ఎగిసిపడుతున్నట్టు ఈ చిత్రాల్లో కనిపిస్తున్నదని ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫొటోల్లో ఈ ఆకృతులు చిన్నగా కనిపిస్తున్నా ఒక్కోటి అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రమంత పరిమాణంలో ఉన్నాయని చెప్పింది. logo