మంగళవారం 14 జూలై 2020
National - Jun 29, 2020 , 01:46:30

విదేశీ జంతువుల దిగుమతులకు కొత్త నియమాలు

విదేశీ జంతువుల దిగుమతులకు కొత్త నియమాలు

న్యూఢిల్లీ: విదేశాలకు చెందిన అరుదైన జంతువులు, పక్షుల దిగుమతులు, ఎగుమతులకు సంబంధించి కేంద్రం కొత్త నియమాలను రూపొందించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆద్వర్యంలో ఈ నిబంధనల్ని తీసుకొచ్చింది. వీటి ప్రకారం.. విదేశీ ప్రాణులను కలిగి ఉన్న యజమానులు లేదా వ్యాపారులు విధిగా ఆ వివరాల్ని రాష్ట్ర వన్యప్రాణి విభాగం అధికారికి తెలియజేయాలి. ప్రాణుల్ని ఉంచిన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు తదితర వివరాలు అందించాలి. అధికారులు చేసే తనిఖీల సమయంలో వారికి సహకరించాలి.


logo