కొత్త కొత్తగా..!

- కొత్త ఏడాది నుంచి నిబంధనల్లో మార్పులు..
- కస్టమర్ల సౌలభ్యం కోసం వివిధ సంస్థల నిర్ణయం..
- నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్
న్యూఢిల్లీ , డిసెంబర్ 31: కొత్త సంవత్సరం కొత్త కొత్త నిబంధనలను తీసుకువస్తున్నది. బ్యాంకుల నుంచి సాంకేతికరంగం వరకు వినియోగదారులకు మరింత సులభంగా, సురక్షితంగా సేవలను అందించేందుకు పలు సంస్థలు తమ నిబంధనల్లో మార్పులు చేశాయి. కొత్త ఏడాది ప్రారంభం అవుతున్న శుక్రవారం నుంచి కొత్తగా అమల్లోకి రాబోతున్న అంశాలు ఇవే.
చెక్కు చెల్లింపుల్లో మరిన్ని జాగ్రత్తలు
చెక్కు చెల్లింపుల్లో మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ పాజిటివ్ పే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం రూ.50వేలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కు పేమెంట్లు జరిపేటప్పుడు వివరాలను మరొకసారి సరిచూసుకొని నిర్ధరించుకొన్న తర్వాతే బ్యాంకు అధికారులు లావాదేవీల ప్రక్రియను పూర్తిచేస్తారు.
కాంటాక్ట్‌లెస్ కార్డు చెల్లింపుల పరిమితి పెంపు
డిజిటల్ చెల్లింపులను మరింత భద్రంగా నిర్వహించేందుకు ఆర్బీఐ కాంటాక్ట్ లెస్ కార్డు చెల్లింపుల పరిమితిని రూ.2వేల నుంచి రూ.5వేలకు పెంచింది. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. కరోనా నేపథ్యంలో కాంటాక్ట్‌లెస్ కార్డు లావాదేవీలకు ఆదరణ పెరిగింది.
కొన్ని ఫోన్లలో వాట్సాప్ పని చేయదు
శుక్రవారం నుంచి కొన్ని నిర్దిష్ట ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ఉన్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0.3 అంతకంటే కొత్తవి, ఐఫోన్లలో ఐవోఎస్ 9 అంతకంటే కొత్తవి, సెలెక్ట్ ఫోన్లలో కాయ్ ఓఎస్ 2.5.1 వర్షన్ అంతకంటే కొత్త ఓఎస్ ఉన్న ఫోన్లు, జియో ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది.
మొబైల్ నంబర్ ముందు 0 ఉండాల్సిందే
ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ నంబర్లకు కాల్ చేసినప్పుడు ఇక నుంచి నంబర్ ముందు ‘0’ చేర్చాల్సి ఉంటుంది.
ఇన్స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్‌పై గూగుల్ పే చార్జీ
గూగుల్ పే ఇన్స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్‌కు చార్జీలు వసూలు చేయనున్నది. ఈ నిర్ణయం వెబ్ యాప్‌కు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఎంత మేర చార్జీలు వసూలు చేస్తారన్నది వెల్లడించలేదు. గూగుల్ డెబిట్ కార్డు మనీ ట్రాన్స్‌ఫర్‌పై 1.5 శాతం ఫీజు వసూలు చేస్తామని పేర్కొన్నది. అంటే గూగుల్ ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్లో కూడా ఇదే స్థాయిలో చార్జీలు పడే అవకాశం ఉంది.
జీఎస్టీ రిటర్న్స్ ఇకపై 4 సార్లే
రూ.5 కోట్ల దాకా టర్నోవర్ ఉన్న కంపెనీలు ప్రస్తుతం ఏడాదిలో 12 సార్లు జీఎస్టీ సేల్స్ రిటర్న్‌లు దాఖలు చేయాలి. జనవరి 1 నుంచి ఈ సంఖ్యను నాలుగుకు కుదించారు. దీని వల్ల 94 లక్షల మంది పన్ను చెల్లింపుదార్లకు లబ్ధి చేకూరనున్నది. జీఎస్టీ మొత్తం ట్యాక్స్ బేస్‌లో వీరి వాటా 92శాతం.
తాజావార్తలు
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
- ఆ షాట్ ఏంటి?.. రోహిత్‌పై గావస్కర్ ఫైర్
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సెలింగ్
- కష్టపడకుండా బరువు తగ్గండి ఇలా?
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- నిర్మలమ్మకు విషమపరీక్ష: ఐటీ మినహాయింపులు పెరిగేనా?!
- రన్‌వేపైకి దూసుకెళ్లిన కారు.. ఒక వ్యక్తి అరెస్ట్
- భారత అభిమానిపై జాత్యహంకార వ్యాఖ్యలు
- టీఆర్ఎస్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- బైడెన్ ప్రమాణస్వీకారంలో ప్రత్యేక ఆకర్శణగా లేడీ గాగా, లోపెజ్