పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రీసెంట్గా జరిపిన పరీక్షలలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకొని ఆయన అభిమానులు, సన్నిహితులు షాక్ అయ్యారు. ప్రస్తుతం పవన్ క్షేమంగానే ఉన్నారని, త్వరలోనే ప్రజలు, అభిమానుల ముందుకు వస్తారని సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే పవన్‌ను కరోనా అని తెలిసి సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా ప్రముఖులు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా..పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, అందరి ఆశీర్వాదాలు, ప్రేయర్స్ ఎప్పుడు ఉంటాయని ట్వీట్లో పేర్కొన్నారు సూపర్ స్టార్. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంపై కూడా మహేష్ బాబు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కంబ్యాక్ చాలా అద్భుతంగా ఉంది. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు అంటూ పవన్‌పై ప్రశంసలు కురిపించాడు మహేష్.