వచ్చే జూన్‌లోపు కాంగ్రెస్‌కు కొత్త సారథి!

న్యూఢిల్లీ, జనవరి 22: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతున్నది. జూన్ నాటికి పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో సుమారు మూడున్నర గంటలపాటు ఈ సమావేశం జరిగింది. అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణను కూడా చేపట్టబోతున్నట్టు పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సూర్జేవాలా మీడియాతో తెలిపారు. సాగుచట్టాల రద్దు, అర్ణబ్ వాట్సాప్ సందేశాలపై విచారణ , పేదలకు కొవిడ్-19 టీకాను త్వరితగతిన అందేలా చూడటం.. ఈ మూడు తీర్మానాలను సీడబ్ల్యూసీ ఆమోదించింది. కాగా, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. సంప్రదింపుల సమయంలో రైతులతో అహంకారపూరిత ధోరణితో ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు.
తాజావార్తలు
- రికార్డులు బ్రేక్ చేసిన అశ్విన్
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి సాధ్యమేనా?!
- సూరత్‌లో బీజేపీ కన్నా ఆప్‌కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్‌కు చిక్కులే!
- ఇంగ్లాండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ఎంటర్టైనింగ్గా 'షాదీ ముబారక్' ట్రైలర్
- ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ పడిపోబోయిన సీఎం మమత