గురువారం 16 జూలై 2020
National - Jun 16, 2020 , 18:14:54

'ఈపీఎఫ్' సెటిల్‌మెంట్ల‌కు కొత్త విధానం

'ఈపీఎఫ్' సెటిల్‌మెంట్ల‌కు కొత్త విధానం

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌) ఖాతాదారులకు వెసులుబాటు క‌ల్పించేలా ఈపీఎఫ్‌వో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లలో సమస్యలు తలెత్తకుండా ఓ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏ ప్రాంతీయ కార్యాల‌యంలోనైనా క్లెయిమ్ సెటిల్‌మెంట్ల‌ను పూర్తిచేసుకునేలా 'మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఫెసిలిటీ'ని ప్రారంభించింది. 

దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఈపీఎఫ్ కార్యాలయాలు త‌క్కువ సిబ్బందితోనే ప‌నిచేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో విధుల్లో ఉన్న కొద్దిమంది సిబ్బందికి ప‌ని భారం పెరిగి ఖాతాదారుల క్లెయిమ్ సెటిల్‌మెంట్ల‌లో తీవ్ర జాప్యం జ‌రుగుతున్న‌ది. దీంతో ఏ ప్రాంతీయ కార్యాలయంలోనైనా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లు పూర్తి చేసుకునేలా పాత‌ విధానంలో మార్పులు చేశారు. 

పీఎఫ్, పింఛన్‌, నగదు పాక్షిక ఉపసంహరణ, బదిలీ క్లెయిమ్‌ల వంటి అన్ని రకాల ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల‌ను ఈ 'మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఫెసిలిటీ' ద్వారా పూర్తి చేసుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. 


logo