బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 19, 2020 , 14:15:07

గోల్డ్ కొనేందుకు "వన్ ఇండియా.. వన్ గోల్డ్ రేట్ " స్కీం..!

గోల్డ్ కొనేందుకు

ఢిల్లీ : బంగారం ధరలు ఒక్కోరాష్ట్రం ఒక్కో ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ధరలు మారడానికి చాలా రకాల కారణాలున్నాయి. అయితే దేశంలో ఒకే రేటుకు ఎక్కడైనా బంగారం కొనుగోలు చేసేందుకు ఓ జ్యువెలరీ సంస్థ వినూత్న స్కీం ను ప్రవేశపెట్టింది. గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైల్  చెయిన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 'వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్' పేరుతో సరికొత్త పాలసీని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలలో 100 శాతం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) హాల్‌మార్క్డ్ బంగారానికి ఒకేరకమైన ధర మలబార్ గోల్డ్  దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షాపుల్లో అందుబాటులో ఉంటుంది.

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైల్ స్టోర్లలో 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ జువెలరీని కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. కోవిడ్ 19 కారణంగా వివిధ రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని మలబార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్ తెలిపారు. అయితే గోల్డ్ డిమాండ్‌ మాత్రం అలాగే ఉందని, కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోని 120 మలబార్ షోరూమ్‌లలో ఒకే రకమైన బంగారం ధరలు, మార్పిడిపై సున్నా శాతం తగ్గింపు, తిరిగి కొనుగోలుపై ఉత్తమ విలువ వంటివి అన్ని మునుపటిలాగే కొనసాగుతాయి.వారెన్ బఫెట్ సంచలన నిర్ణయాలు...

 లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.