బుధవారం 27 జనవరి 2021
National - Jan 14, 2021 , 01:32:18

రేపటి నుంచే కొత్త పార్లమెంటు నిర్మాణం!

రేపటి నుంచే కొత్త పార్లమెంటు నిర్మాణం!

న్యూఢిల్లీ: సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంటు భవనం నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం కాబోతున్నాయని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ‘కొత్త పార్లమెంటు నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించమని నిర్మాణ సంస్థ టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ను సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ కోరింది’ అని పేర్కొన్నాయి. రూ.971 కోట్ల విలువైన కొత్త పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్టు టాటా ప్రాజెక్ట్సుకు దక్కడం తెలిసిందే. 


logo