గురువారం 28 మే 2020
National - May 07, 2020 , 13:22:26

కరోనా కట్టడికి యూపీ ప్ర‌భుత్వం కొత్త ఆర్డినెన్సు

కరోనా కట్టడికి యూపీ ప్ర‌భుత్వం కొత్త ఆర్డినెన్సు

క‌రోనాను కట్టడి చేసెందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప‌లు కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందులో భాగంగానే కొత్త ఆర్డినన్స్ తెచ్చింది. కరోనా లక్షలున్నా ఉద్దేశపూర్వకంగా దాచేవారికి జైలు శిక్ష విధించే విధంగా కొత్తగా ఆర్డినెన్సు తీసుకురానున్నారు.  ఏడాది నుంచి మూడేళ్ల వరకూ జైలుశిక్ష... 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ జరిమానా విధిస్తారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినా, ఆసుపత్రుల నుంచి పారిపోయినా ఏడాది నుంచి మూడేళ్ల వరకూ జైలుశిక్ష తప్పదు. కరోనా కట్టడి చేసేందుకు యత్నిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులపై దాడులకు పాల్పడితే ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష అమ‌లుకానుంది. ఇంకా ఐదు లక్షల వరకూ జరిమానాలు కూడా విధిస్తారు. తాజా ఆర్డినన్స్ ప్రకారం లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్ప‌టికే ఈ ఆర్డినన్స్‌ను యోగి సారద్యంలోని కేబినెట్ ఆమోదించింది.



logo