గురువారం 09 జూలై 2020
National - May 01, 2020 , 20:17:53

పాఠశాలలు, కళాశాలలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

పాఠశాలలు, కళాశాలలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ తర్వాత తెరిచే పాఠశాలలు, కళాశాలలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాలలు, కళాశాలలకు వేర్వేరు మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది కేంద్రం. కొత్త సీటింగ్‌ ఆరేంజ్‌మెంట్‌, షిఫ్ట్‌ల వారీ తరగతులు ఉండాలని కేంద్రం పేర్కొంది. గ్రంథాలయం, క్యాంటీన్లు, హాస్టళ్లల్లో సరికొత్త పద్ధతులు పాటించాలని వెల్లడించింది. కళాశాలలు, వర్సిటీల్లో కొత్త చేరేవారికి సెప్టెంబర్‌ నుంచి విద్యా సంవత్సరం మొదలు కానుంది. విద్యాలయాల్లో ఉదయం నిర్వహించే అసెంబ్లీతో పాటు క్రీడా కార్యక్రమాలను రద్దు చేసింది కేంద్రం. ఏకరూపు దుస్తుల్లాగే మాస్కును తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. మెస్‌లు, వసతి గృహాలు, బస్సుల్లో తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని ఆదేశించింది. క్యాంటీన్లు, శౌచాలయాల్లో ఎలా ఉండాలనే దానిపై అవగాహన కల్పించాలని విద్యాలయాల యాజమాన్యాలకు సూచించింది. 


logo