బుధవారం 05 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 22:35:01

‘కొత్త విద్యా విధానంతో ప్రయోజనం శూన్యం’

‘కొత్త విద్యా విధానంతో ప్రయోజనం శూన్యం’

పాండిచ్చేరి :  కేంద్రం ప్రకటించిన నూతన విద్యా విధానంతో ప్రయోజనం శూన్యమని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. నూతన విద్యా విధానంపై ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ఇది ప్రజలకు ప్రయోజనం చేకూర్చని విద్యా విధానం. కొత్త విద్యా విధానంతో పాండిచ్చేరిలో ఎలాంటి మార్పు రాదు' అని పేర్కొన్నారు. కొత్త విద్యా విధానంపై ప్రజలు, మంత్రులు, శాసనసభ్యుల అభిప్రాయాల తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల చదువుకు కేంద్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. 2035 నాటికి 50 శాతం స్థూల నమోదుశాతం, బహుళ ప్రవేశాలు, నిష్క్రమణలతో సహా ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలు తీసుకొచ్చి జాతీయ విద్యా విధానం 2020కి కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.


logo