శుక్రవారం 05 జూన్ 2020
National - May 15, 2020 , 12:38:29

ఒరిస్సా హైకోర్టులో లాయర్లకు కొత్త డ్రెస్‌ కోడ్‌

ఒరిస్సా హైకోర్టులో లాయర్లకు కొత్త డ్రెస్‌ కోడ్‌

భువనేశ్వర్‌: ఒరిస్సా హైకోర్టులో న్యాయవాదులకు కొత్త డ్రెస్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో కోర్టులో విచారణ సందర్భంగా న్యాయవాదులు నల్లకోటు, గౌన్‌ వేసుకోకూడదని.. తెల్ల అంగీ లేదా తెల్లరంగు సల్వార్‌ కమీజ్‌పైన తెల్లని నెక్‌ బ్యాండ్‌ ధరించాలని హైకోర్టు సూచించింది. మహళా న్యాయవాదులైతే తెల్లరంగు చీరతోపాటు తెల్లని నెక్‌ బ్యాండ్‌ ధరించాలని పేర్కొన్నది. ఈ మేరకు ఒరిస్సా హైకోర్టు గురువారం రాత్రి ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ కొత్త డ్రెస్‌ కోడ్‌ను అనుసరించాలని సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. కాగా, సుప్రీంకోర్టు సైతం న్యాయవాదులకు కొత్త డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తూ బుధవారం రాత్రి సర్క్యులర్‌ జారీచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒరిస్సా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.      


logo