బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 04:15:06

కరోనా బాధితులకు మెరుగైన చికిత్స

కరోనా బాధితులకు మెరుగైన చికిత్స

  • 12న వరంగల్‌లో కొవిడ్‌ అదనపు బ్లాక్‌ ప్రారంభం
  • పంచాయత్‌రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి

పోచమ్మమైదాన్‌ (వరంగల్‌): కరోనా బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నదని పంచాయత్‌రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ కేఎంసీలో పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద నిర్మిస్తున్న సూపర్‌స్పెషాలిటీ భవన పనులను మంగళవారం పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ చీఫ్‌విప్‌ ద్యాసం వినయ్‌భాస్కర్‌, ఇంచార్జి కలెక్టర్‌ హరిత, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య తదితరులతో కలిసి మంత్రి సమీక్ష చేశారు. కొవిడ్‌ బాధితులకు అదనపు సేవల కోసం కేఎంసీలోని సూపర్‌స్పెషాలిటీ భవనంలో ప్రత్యేకంగా బ్లాక్‌ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ నెల 12న వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభిస్తారన్నారు. ఇందులో తొలుత 120 పడకలకు అవసరమైన ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.


logo