మరో డేంజరస్ కరోనా మ్యుటేషన్.. ఈసారి ఇండియాలోనే..

ముంబై: యూకేలో కనిపించిన కరోనా కొత్త స్ట్రెయిన్‌ను చూసి ప్రపంచమంతా వణుకుతోంది. అయితే అంతే ప్రమాదకరమైన మరో కరోనా మ్యుటేషన్ ఇండియాలోనే కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌కు చెందిన ముగ్గురు కరోనా పేషెంట్ల శాంపిల్స్‌లో ఈ మ్యుటేషన్‌ను కనుగొన్నది ఖర్గార్‌లోని టాటా మెమోరియల్ సెంటర్. దీనికి E484K మ్యుటేషన్‌గా పిలుస్తున్నారు. సౌతాఫ్రికాలో కనిపించిన మూడు మ్యుటేషన్ల ((K417N, E484K and N501Y)లో ఇదీ ఒకటని ఇక్కడి అసోసియేట్ ప్రొఫెసర్ నిఖిల్ పట్కార్ వెల్లడించారు. మొత్తం 700 శాంపిల్స్‌కు జెనెటిక్ సీక్వెన్సింగ్ చేస్తుండగా.. అందులో ముగ్గురిలో ఈ మ్యుటేషన్ కనిపించినట్లు చెప్పారు. ఇది శరీరంలోని యాంటీ బాడీస్‌ను బోల్తా కొట్టిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపారు.
యూకే వేరియంట్ కంటే డేంజర్
అందరి దృష్టీ యూకే వేరియంట్‌పై ఉంది కానీ.. దాని కంటే సౌతాఫ్రికాలో కనిపించిన ఈ E484K ఇంకా ప్రమాదకరంగా కనిపిస్తోంది. వ్యాక్సిన్ ప్రధానంగా యాంటీ బాడీలను వృద్ధి చేస్తుంది. అయితే ఈ కొత్త వేరియంట్ ఆ యాంటీ బాడీలనే బోల్తా కొట్టిస్తుండటం వల్ల అసలు వ్యాక్సినేషన్ వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నవీ ముంబై, పాన్వెల్, రాయ్‌గడ్‌లలోని కొవిడ్ పేషెంట్ల జెనెటిక్ సీక్వెన్సింగ్ చేస్తోంది టాటా మొమోరియల్ సెంటర్. ఇప్పుడీ కొత్త మ్యుటేషన్ వచ్చిన పేషెంట్లు గత సెప్టెంబర్‌లో కొవిడ్ బారిన పడినట్లు డాక్టర్ నిఖిల్ పట్కార్ చెప్పారు. వీళ్లకు చాలా స్వల్పమైన లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు కేవలం ఇంట్లోనే క్వారంటైన్లో ఉండగా.. ఒకరు మాత్రం ఆసుపత్రిలో సాధారణ చికిత్స తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
వాట్సాప్ ప్రైవసీ పాలసీలో ఏముంది.. మీ మెసేజ్‌లనూ చోరీ చేస్తుందా?
ఇదీ టీమిండియా ప్లేయర్స్ గాయాల చిట్టా.. ఎవరికి ఏ గాయం?
సిరాజ్‌పై మళ్లీ నోరు పారేసుకున్న ఆస్ట్రేలియా అభిమానులు.. వీడియో
పెండ్లికాని ప్రసాదుల గుండెకు దెబ్బ!
తాజావార్తలు
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్‌వో అసంతృప్తి
- అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్‌కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర
- బైక్‌పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో
- సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం
- హైదరాబాద్‌లో 50 కేజీల గంజాయి స్వాధీనం
- లైగర్ పోస్టర్ విడుదల .. బీరాభిషేకాలు, కేక్ కటింగ్స్‌తో ఫ్యాన్స్ రచ్చ
- తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు
- క్యాన్సర్ వైద్య నిపుణురాలు శాంత కన్నుమూత