బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 07:50:22

కరోనా వైరస్‌లో కొత్త మార్పులు

కరోనా వైరస్‌లో కొత్త మార్పులు

లండన్‌ : కరోనా వైరస్‌లో జన్యుక్రమంలో మార్పు చోటుచేసుకుందని, దీంతో వైరస్‌లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్ధ్యం పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. కొవిడ్‌ చెందిన కోవ్‌-2 వైరస్‌లో ‘డీ614జీ’ అనే రకం వచ్చి చేరిందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. పరిశోధనల్లో దీనికి ఎక్కవగా సంక్రమించే లక్షణాలు ఉన్నయని తేలిందని తెలిపారు. ఏప్రిల్‌లోనే ఈ రకం వైరస్‌ శాస్త్రవేత్తల దృష్టికి వచ్చిందని తెలిపారు.

ప్రపంచంలో వైరస్‌ అధికంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ‘డీ614జీ’ చేరడంతో పరిస్థితి తారుమారు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త వైరస్సే ఇ‌న్ఫెక్షన్‌ కలింగిచే స్థాయిని పెంచుతుందని శాస్త్రవేత్త బెటె కోర్బర్‌ చెప్పారు.  ఈ వైరస్‌ తన ఆకృతి సాయంతో మానవ కణాల్లోకి అధికంగా ప్రవేశిస్తుందని తెలిపారు. 


తాజావార్తలు


logo