గురువారం 28 మే 2020
National - May 21, 2020 , 14:39:33

కర్ణాటకలో కొత్తగా 116 కరోనా పాజిటివ్‌ కేసులు

కర్ణాటకలో కొత్తగా 116 కరోనా పాజిటివ్‌ కేసులు

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 116 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1578కి చేరింది. ఇప్పటివరకు 570 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 966 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ వైరస్‌ బారిన పడిన 41 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 14 మంది కోలుకున్నారు.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,12,359కి చేరుకోగా, 3435 మంది బాధితులు మరణించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 5609 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 132 మంది మృతిచెందారు.


logo