ఆదివారం 05 జూలై 2020
National - Jul 01, 2020 , 02:10:57

పతంజలి యూటర్న్

పతంజలి యూటర్న్

  • ‌ తమ ఔషధం వ్యాధిని నయం చేస్తుందని చెప్పలేదని వెల్లడి 

డెహ్రాడూన్‌: కరోనా చికిత్సకు ఔషధం తీసుకొచ్చామని గతవారం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన పతంజలి సంస్థ.. అంతలోనే యూటర్న్‌ తీసుకున్నది. తాము తయారు చేసిన ఔషధం (కరోనిల్‌ కిట్‌) కరోనాను తగ్గిస్తుందని లేదా నయం చేస్తుందని తామెప్పుడూ చెప్పలేదని పేర్కొంది. ఈ మేరకు ఉత్తరఖండ్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటీసుకు ఓ సమాధానమిచ్చింది. ఒక ఔషధాన్ని తాము తయారుచేశామని, ఔషధ పరీక్షల్లో అది విజయవంతమైనట్టు మాత్రమే మీడియాకు చెప్పామని, మీడియా తప్పుగా చూపించడంవల్లే గందరగోళం ఏర్పడిందని వెల్లడించింది.


logo