గురువారం 03 డిసెంబర్ 2020
National - Sep 20, 2020 , 02:49:56

డాక్టర్‌ సౌందర్‌రాజన్‌కు ‘నెఫ్రాలజీ ద్రోణాచార్య’

డాక్టర్‌ సౌందర్‌రాజన్‌కు ‘నెఫ్రాలజీ ద్రోణాచార్య’

  • గవర్నర్‌ తమిళిసై భర్తకు అరుదైన గౌరవం 

న్యూఢిల్లీ: ప్రముఖ నెఫ్రాలజీ (మూత్రపిండాల వైద్య నిపుణులు) వైద్యుడు డాక్టర్‌ సౌందర్‌రాజన్‌ వైద్యరంగంలో ద్రోణాచార్య అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలోని గంగారామ్‌ దవాఖాన చైర్మన్‌ డాక్టర్‌ రాణా నేతృత్వంలోని నెఫ్రాలజిస్టుల బృందం ఈ ఏడాది ద్రోణాచార్య అవార్డును సౌందర్‌రాజన్‌కు ప్రకటించింది. దేశంలో విశేష సేవలు అందించిన నెఫ్రాలజీ ఫ్రొఫెసర్లకు ఢిల్లీ నెఫ్రాలజీ ఫోరం ద్రోణాచార్య అవార్డులను ప్రకటిస్తుంది. సౌందర్‌రాజన్‌ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ భర్త. 35 ఏండ్లుగా ఆయన నెఫ్రాలజీ వైద్యుడిగా విశేష సేవలందించారు.